Skip to main content

ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 1తోఅడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగుస్తాయి. జూన్‌ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్‌ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్‌ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్‌ కోర్సులకు సంబంధించి కూడా పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. వాస్తవానికి మే రెండో వారం నుంచే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలు, దాని ఫలితంగా దారితీసిన పరిస్థితులతో తేదీల మార్పు అనివార్యమైంది. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌ పక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ముందుకు వెళ్లాయి.
అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ...


ఫలితాల విడుదల ఆలస్యం...
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ మూడో వారంలో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్‌ ఫలితాలపై బోర్డులో నెలకొన్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. సాంకేతిక సమస్యల పరిష్కారంతోపాటు రిజల్ట్స్‌ ప్రాసెస్‌ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదల ఆలస్యమయ్యేకొద్దీ ఆ ప్రభావం విద్యార్థులపై పడనుంది. సాధారణంగా జూన్‌ మొదటి వారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పలు రకాల సెట్లకు సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరవుతారు. ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో జాప్యం జరిగితే ఆయా అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు.

Comments

Popular posts from this blog

Earthquake In Arunachal Pradesh

NEW DELHI: A strong 6.1-magnitude earthquake struck Arunachal Pradesh early Wednesday, the US Geological Survey said. The epicenter of the shallow earthquake was about 40 kilometres (25 miles) southeast of Along, and 180 kilometres southwest of the state capital Itanagar. It struck at 1:45 am. Arunachal Pradesh is the least densely populated state, but is still home to more than 1.2 million people, according to the state government's website. China's official state news agency Xinhua said the earthquake was felt in Tibet, which neighbors the state. New Delhi and Beijing for decades have disputed control of Arunachal Pradesh -- a dispute that remains unresolved. India considers Arunachal Pradesh one of its northeastern states, while China claims about 90,000 square kilometres (34,750 square miles) of the territory. Arunachal Pradesh also borders Myanmar and Bhutan. USGS estimated there was a "low likelihood" of casualties and damage from the earthqu

చోరీ అయిన ఆర్టీసీ బస్సు గుర్తుపట్టలేని విధంగా మార్చేశారు

హైదరాబాద్‌ : సీబీఎస్‌లో చోరీకి గురైన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆచూకీ లభించింది. మంగళవారం రాత్రి చోరీకి   గురయిన బస్సును నాందేడ్‌లోని ఓ షెడ్‌లో పోలీసులు గుర్తించారు. కానీ బస్సును ముక్కలు ముక్కలు చేసిన దుండగులు.. దాని గుర్తుపట్టలేని విధంగా మార్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ డిపో ఏపీ 11 జెడ్‌ 6254 నెంబర్‌ గల ఆర్టీసీ బస్సు అంబేడ్కర్‌ నగర్‌, అఫ్జల్‌గంజ్‌ల మధ్య రాకపోకలు సాగిస్తుంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌హాల్ట్‌ కోసం డ్రైవర్‌ ఆ బస్సును సీబీఎస్‌లో నిలిపాడు. అయితే ఆ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు బస్సు కోసం గాలింపు చేపట్టారు. పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్‌ ప్రాంతంలో తిరిగినట్టు ఆధారాలు సేకరించారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు గురువారం నాందేడ్‌లో బస్సును గుర్తించారు. బస్సును అపహరించిన వ్యక్తులు దాని రూపురేఖలు మార్చేందుకు ఆ బస్సును క్రాష్‌ చేస్తున్న సమయంలో అఫ్జల్‌ గంజ్‌ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారు అయ్యారు. దీంతో బస్సు క్

శ్రావణిని చంపిందెవరు?

                                             బావిలో నుంచి శ్రావణి మృతదేహాన్ని బయటికి తీస్తున్న పోలీసులు డ్రగ్స్‌ బానిసలు చేసిన ఘాతుకమా..   గిట్టనివారు చేసిన అకృత్యమా? గ్రామస్తుల అందోళనతో అట్టుడికిన భువనగిరి    బాలిక పక్కటెముకలు విరిగినట్లు గుర్తింపు యాదాద్రి:   యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శ్రావణి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 9వ తరగతి పూర్తి చేసిన శ్రావణి, పాఠశాలలో ప్రైవేట్‌ తరగతులకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న దారుణ ఘటనపై అన్ని వర్గాల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతోంది. శ్రావణిని హత్య చేసింది ఎవరు? అనే అంశంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్లకాదని, నలుగురు వ్యక్తులు ఇందులో పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిందితులను 24 గంటల్లో పట్టుకుంటామని పోలీసులు శ్రావణి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే హత్య వెనక డ్రగ్స్‌ బానిసలు ఉన