ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. ముంబైలోని అతి విలాసవంతమైన భవన సముదాయాన్ని విక్రయించడమో లేదా అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట. తద్వారా కొన్ని అప్పులు తీర్చాలని భావిస్తున్నారు. ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయాన్ని విక్రయించడానికి లేదా దీర్ఘకాలిక లీజ్‌కివ్వడానికి యోచిస్తున్నారు అనిల్ అంబానీ. ఈ మేరకు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్‌స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. తద్వారా 1,500-2,000 కోట్ల రూపాయల సమకూర్చకోనుందని ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. మరోవైపు ఈ భవన క ఊడా చట్టపరమైన చిక్కుకున్న నేపథ్యంలో ఈ లావాదేవీకోసం ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్‌ఎల్‌ను కూడా నియమించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అంబానీ ఆలోచిస్తున్నారని సమాచా
యాదాద్రి/బొమ్మలరామారం : యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో శుక్రవారం వెలుగుచూసిన శ్రావణి హత్య ఉదంతం మరవక ముందే సోమవారం మనీషా అనే యువతి హత్యకుగురైన విషయం వెలుగులోకి వచ్చింది. హర్రర్ సినిమాను తలపించే రీతిలో ఒకే తరహాలో వెలుగుచూస్తున్న వరుస హత్యలు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నాయి. పేద బాలికలను టార్గెట్ చేసి పథకం ప్రకారం వారిపై అత్యాచారం, హత్య చేసి పూడ్చిపెడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రావణి మృతదేహం లభించిన వ్యవసాయ బావిలోనే మనీషా (19) మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు భారీ పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాన్ని బావిలోంచి తీసి పోస్టుమార్టం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒంటరి మహిళలే టార్గెట్: హాజీపూర్ వద్ద జరిగిన బాలిక, యువతి హత్యలు ఒకేతీరును పోలి ఉండటంతో నిందితుడు ఒక్కడే అన్న అనుమానం బలపడుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి ఈహత్యలతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమయంలో పలు విషయాలు వెల్లడైనట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి లిప్టు మెకానిక్‌గా